జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు జరగడం... ఫన్నీ సంఘటనలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఈ మధ్య సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా క్రికెట్‌ కు సంబంధించిన ఫన్నీ వీడియో లు.. ఫన్నీ సంఘటనలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్‌ వద్దకు బాల్ రావడంతోనే దాన్ని బౌడరీకి కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఆ బాల్ ను తన వద్ద ఉంచుకుని కీపర్ అడిగినా ఇవ్వను అంటూ కొన్ని నిమిషాలు నవ్వులు పూయించిన సంఘటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అది కూడా ఒక ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్ అవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంఘటన తాలూకు వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. 


అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రీలంక, పాకిస్తాన్‌ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ లో మొదట బ్యాంగింగ్ చేసిన శ్రీలంక 312 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టింది. పాకిస్తాన్‌ 9 వికెట్లు నష్టపోయి 457 పరుగులు చేసింది. 


పాక్ ఆటగాళ్లు అబ్రార్‌ అహ్మద్‌.. సౌద్‌ షకీల్ లు క్రీజ్ లో ఉన్న సమయంలో శ్రీలంక బ్యాట్స్మెన్‌ రమేష్ మెండిస్ వేసిన బాల్ వెళ్లి నేరుగా అబ్రార్‌ గ్లౌజ్ కి తాకి కాలికి ఉన్న ఫ్యాడ్‌ లో చిక్కుకుంది. కీపర్ ఔట్ అంటూ అప్పీల్‌ చేశాడు. కానీ అంపైర్ స్పందించలేదు. వెంటనే బంతిని పట్టుకునేందుకు కీపర్ ప్రయత్నించాడు. కానీ బంతి కనిపించలేదు. బంతి అబ్రార్ కాలికి ఉన్న ఫ్యాడ్‌ లో ఉందని గమనించాడు. 



Also Read: Telangana Rains: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు   


అబ్రార్ ఫ్యాడ్ నుండి ఆ బంతిని తీసుకునేందుకు ప్రయత్నించిన కీపర్ కి ఆ బాల్ దొరక్కుండా ప్రయత్నించాడు. కొన్ని సెకన్ల పాటు ఇద్దరి మధ్య బాల్ కోసం జరిగిన ఫన్నీ కీచులాట అందరి దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా అందరిని నవ్వుల్లో ముంచెత్తింది. మ్యాచ్ ఫలితం ఏమో కానీ ఇలాంటి ఫన్నీ సంఘటనలు జరిగిన సమయంలో ఆ మ్యాచ్ లు చాలా కాలం గుర్తుండి పోతాయి. 


ఆ మ్యాచ్ వల్ల మొత్తం సిరీస్‌ కు గుర్తింపు వస్తుంది. నిన్న మొన్నటి వరకు లంక.. పాక్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ గురించి ఏ ఒక్కరు పట్టించుకోలేదు. కానీ సోషల్‌ మీడియా లో ఈ సంఘటన వైరల్ అవ్వడంతో మ్యాచ్ ను చూసేందుకు క్రికెట్‌ అభిమానులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఎగబడుతున్నారు.


Also Read: Citroen New Car: సిట్రోయెన్ నుంచి మరో కొత్త కారు, హోండీ సిటీ, వెర్నాలను ఢీ కొట్టేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి